అలెగ్జాండర్ గ్రాహంబెల్

 (3 మార్చి 1847 – 2 ఆగస్టు 1922) అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, టెలీఫోనును కనిపెట్టాడు.

బాల్యము

గ్రహంబెల్ మార్చి 3, 1847 న స్కాట్‌లాండ్ లోని ఎడిన్‌బర్గ్ లో జన్మించడం జరిగింది. ఆయన బాల్య జీవితమంతా బ్రిటీష్ పౌరుడిగానే పెరిగాడు. ఆయనకు ఇద్దరు సోదరులు మెల్విలే జేమ్స్ బెల్, ఎడ్వర్డ్ చార్లెస్ బెల్. వీరిరువురూ క్షయ వ్యాధితో మరణించారు. ఆయన తండ్రి ప్రొఫెసర్ అలెగ్జాండర్ మెల్విలే బెల్. తల్లి పేరు ఎలీజా గ్రేస్.

టెలిఫోన్ ఆవిష్కరణ

హంబెల్‌ తాత, తండ్రి వక్తృత్వం, సంభాషణల విషయాలపై పరిశోధన చేస్తుండేవారు. ప్రాథమిక విద్యను తండ్రి వద్దే అభ్యసించిన గ్రాహంబెల్‌ ఎడింబరోలోని రాయల్‌ హైస్కూల్లో చదువుకుని, పదహారేళ్లకల్లా అక్కడే వక్తృత్వం, సంగీతాలను నేర్పించే పనిలో చేరాడు. తల్లి క్రమేణా వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో సంజ్ఞలతో భావ వ్యక్తీకరణలో ఆరితేరాడు. ఆమె నుదిటి ఎముకకు దగ్గరగా ఒక రకమైన ఉచ్ఛారణతో మాట్లాడే ప్రయత్నంలో ధ్వని శాస్త్రాన్ని (Acoustics) అర్థం చేసుకున్నాడు.

ఆపై ఎడింబరో విశ్వవిద్యాలయంలో ధ్వని, వినికిడి శాస్త్రాలు చదివి అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో 'గాత్ర సంబంధిత శరీర శాస్త్రం' (వోకల్‌ ఫిజియాలజీ)లో ప్రొఫెసర్‌గా చేరాడు. భార్య సైతం వినికిడి శక్తిని కోల్పోవడంతో బధిరుల కోసం పరిశోధనలు చేసి, వారు వినగలిగే శబ్ద పరికరాలను రూపొందించాడు. పగలంతా బోధిస్తూ, రాత్రంతా మేలుకుని ప్రయోగాలు చేసేవాడు. ఆ కృషి కారణంగానే తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగే టెలిఫోన్‌ను కనిపెట్టగలిగాడు. దీనిపై 1876లో ఆయనకు లభించిన పేటెంట్‌ అమెరికాలోనే శాస్త్రరంగంలో మొదటిది. ఆపై ఆప్టికల్‌ టెలికమ్యూనికేషన్స్‌, హైడ్రోఫాయిల్స్‌, ఏరోనాటిక్స్‌ రంగాల్లో కూడా అనేక ఆవిష్కరణలు చేశాడు. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ వ్యవస్థాపకుల్లో గ్రాహంబెల్‌ కూడా ఒకరు.

ఇతర ఆవిష్కరణలు

గ్రహంబెల్ ను చాలామంది టెలిఫోన్ ఆవిష్కర్తగా గుర్తుంచుకున్నా ఆయన వివిధ రంగాలలో ఆసక్తిని కనబరచాడు.

పురస్కారాలు, సన్మానాలు, నివాళులు

1880 వ సంవత్సరంలో టెలిఫోన్ ఆవిష్కరణకు గాను ఫ్రెంచి ప్రభుత్వం ప్రధానం చేసే వోల్టా పురస్కారాన్ని గెలుచుకున్నాడు. దీని విలువ 50,000 ఫ్రాంకులు( సుమారు 10,000 డాలర్లు).

Post a Comment

 
Top